NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బుద్ధునితో నా ప్రయాణం నాటకానికి మంచి స్పందన లభించింది

1 min read

– బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా శాఖ

ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్పీ రెండోవ బెటాలియన్ డిఎస్పి మహబూబ్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ది బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో  కర్నూలు పట్టణంలోని, సి క్యాంపు లో ఉన్న టిజివి కళాక్షేత్రంలో జరిగిన బుద్ధునితో నా ప్రయాణం అనే బుద్ధ అంబేడ్కర్ తెలుగు నాటకానికి భారీ స్పందన లభించింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్  బుద్ధుని, బుద్ధ దమ్మాన్ని ఎందుకు ఉన్నతంగా భావించారు. లక్షలమంది ప్రజలను బౌద్ధ దమ్మమ్(ధర్మం) వైపు నడిపడానికి కారణం ఈ నాటకం మనకు తెలియజేస్తుంది. జులై-1వ తేదీ  నుండి జులై-31 వరకు ఈ నాటకాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో  ప్రదర్శించడం జరుగుతున్నది. కాగ ఆంద్ర ప్రదేశ్ లో మొట్టమొదటి ప్రదర్శన కర్నూలు నగరంలో నిర్వహించడం జరిగింది.    దీనికి ది బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంద్ర ప్రదేశ్ అధ్యక్షులు వై.హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని, బుద్ధవందనం చేయించారు.     బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా అధ్యక్షురాలు డి.నాగమ్మ పూలే  జ్యోతి ప్రజ్వలన చేయగా, బి.సి. సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట.శ్రీనివాసులు బుద్ధిని చిత్రపటానికి పూల మాలవేసి, నివాళులు సమర్పించారు.  సామాజిక ఉద్యమ నాయకులు కొమ్ముపాలెం.శ్రీనివాసులు భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్  చిత్రపటానికి పూలమాల వేసి,  రెండు గంటల, పది నిమిషాలు ఉన్న ఈ నాటకాన్ని, చూడటానికి వచ్చిన  వీక్షకులతో టిజివి. కళాక్షేత్రం కిక్కిరిసి పోయింది. బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శనకు బి.ఎస్.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి- మహేష్, రాష్ట్ర కార్యదర్శి ఫణి,  ప్రముఖులు ప్రజా వైద్యశాల డాక్టర్- వి.బ్రహ్మారెడ్డి, సామాజికవేత్త & ఆత్మకూరు ఆదర్శ నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు-డి.నాగన్న, ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ డీఎస్పీ- మహబూబ్ భాష, సురేంద్రనాథ్,కెవిపియస్-జిల్లా నాయకులు ఆనంద్ బాబు, పత్తి.ఓబులయ్య, డి.రామ శేషయ్య, దామోదరం.రాధాకృష్ణ, ఏపీ ట్రాన్స్కో డి.ఈ-శివ కుమార్, హరి ప్రసాద్ హరిప్రసాద్. శేషఫణి, మోసెస్, మొహమ్మద్ మియా, ఆది నారాయణ రెడ్డి, ఆర్.టి.సి. యూనియన్ రాబర్ట్, ఓబులయ్య, రామలింగం, పి.రంగస్వామి  తదితరులు ఈ నాటకాన్ని వీక్షించి, మన నిజమైన చరిత్రను తెలుసుకున్నారని ది బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా అధ్యక్షులు పుసులూరి.చిరంజీవి  తెలియజేశారు.

About Author