మిడుతూరు ఎంఈఓ-2 గా మల్లికార్జున నాయక్..
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల విద్యాశాఖ అధికారి-2 గా బి. మల్లికార్జున నాయక్ (ఎఫ్ఏసీ) గా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఉన్న ఎంఈఓ కే.శ్రీనాథ్ గత నెల 30వ తేదీన పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.ఈయన స్థానంలో కలమందల పాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న మల్లికార్జున నాయక్ ను ఎంఈఓ గా నియమిస్తూ కడప ఆర్జెడీ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో 10వ తరగతిలో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేస్తానని ఎంఈఓ తెలిపారు.ఎంఈఓ ఫైజున్నిసా బేగం మరియు కార్యాలయ సిబ్బంది నూతన ఎంఈఓ-2 కు శుభాకాంక్షలు తెలిపారు.

