NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శక్తి దళం సభ్యులతో సమావేశం

1 min read

మహిళాలు,చిన్నారుల రక్షణే కూటమి ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం

ఆర్టీసీ బస్టాండ్లు,ముఖ్య కోడళ్లలో శక్తి టీం మహిళలు మఫ్టీలో నిఘా

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : మహిళా రక్షణే మా ప్రథమ కర్తవ్యం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,హోం మినిస్టర్ వి.ఆనిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి  హరీష్ కుమార్ గుప్తా, ఏర్పాటు చేసిన శక్తి టీం కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన శక్తి దళం సభ్యులు తో సమావేశం ను ఏలూరు జిల్లా ఎస్పీ  కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై అదనపు ఎస్పీ అడ్మిన్  ఎన్ సూర్య చంద్రరావు నిర్వహించినారు.శక్తి టీము లను 06 టీం లను ఏలూరు టౌన్, ఏలూరు సబ్ డివిజన్ జంగారెడ్డి గూడెం సబ్ డివిజన్, పోలవరం సబ్ డివిజన్ మరియు నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ యొక్క ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు, మహిళలు/చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు: జిల్లా అదనపు  ఎస్పీ అడ్మిన్  ఎన్ సూర్య చంద్రరావు, ఆరుగురు సభ్యులతో జిల్లా వ్యాప్తంగా  ఆరు బృందాలుగా 36 మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ  యొక్క ఆదేశాలపై ఏర్పాటు. జిల్లా  అదనపు ఎస్పీ అడ్మిన్  మాట్లాడుతూ మహిళలు/చిన్నారులకు భద్రతే లక్ష్యంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా జిల్లాలో శక్తి టీమ్స్ ను  ఏర్పాటు చేసినారు.క్రొత్తగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ తో జిల్లా పోలీసు కార్యాలయంలో మమేకమై వారు నిర్వర్తించే విధులు, చేపట్టాల్సిన కార్యక్రమాలను జిల్లా అదనపు  ఎస్పీ  అడ్మిన్  వివరించారు. రాష్ట్రంలో మహిళల పట్ల ఎటువంటి దాడులు,అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చేసేందుకు గాను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ‘శక్తి టీమ్స్’ ను జిల్లాలో ఏర్పాటు చేసామని అదనపు ఎస్పీ అడ్మిన్ గారు తెలిపారు.

ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, పార్కులు, ఆర్టీసీ బస్టాండ్లు, ముఖ్య కూడళ్ళును మఫ్టీలో/యూనిఫారం తో ఉన్న శక్తి దళం సభ్యులు నిఘా ఉంటుందని, ఈ శక్తి టీమ్స్ బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులు అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి వారికి రక్షణ కవచంగా నిలిచేలా పని చేస్తారు. మహిళా వివక్ష, హింస, లైంగిక వేధింపులకు సమాజంలో స్థానం లేదన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ ఏవిధంగా పని చేస్తుందన్న విషయాన్ని మహిళలకు వివరించేలా టీమ్స్ తెలియజేశామన్నారు. వారితో బాడీ వరన్ కెమెరా, డ్రోన్ లతో నిఘా ఉంటుందన్నారు.  ఫిర్యాదు నమోదు, తప్పిపోయిన పిల్లల గురించి రిపోర్టు చేయడం, అక్రమ కార్యకలాపాలపై రిపోర్టు చేయడం, నైట్ షెల్టర్స్, భద్రతతో కూడిన ప్రయాణం, పోలీసు అధికారుల వివరాలు మరియు మొబైల్ నెంబర్ లు, వాట్సాప్ గవర్నెన్స్, అత్యవసర కాంటాక్ట్. లాంటి ఎన్నో అధునాతన ఫీచర్స్ ను ఈ “శక్తి” యాప్ లో పొందుపరచడం జరిగింది.ఈ కార్యక్రమంలో  మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్  ఎం సుబ్బారావు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author