నాన్ స్టాట్యూటరీ బెనిఫిట్స్ ను ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి వర్తింప చేయండి
1 min read
గుంటూరు , న్యూస్ నేడు : జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్, చైర్మన్, ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి, గుంటూరు జిల్లాలోని, చేబ్రోలులో ఒక ప్రకటన చేస్తూ, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ వలన, షెడ్యూల్ క్యాస్ట్ వారికి సంపూర్ణ మత స్వేచ్ఛ లేకుండా పోయిందని, షెడ్యూల్ క్యాస్ట్ వారు మతం మారడం వలన, వారికి ఉన్న రిజర్వేషన్స్ పోయి, బిసి-సి క్యాటగిరిలోకి వెళ్తారు. మతం మారడం వలన, కుల వివక్షత పోలేదు, చర్చి నుంచి వారికేమి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావు, ఇది దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు 2018లో దళిత క్రైస్తువులకు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. విద్యా , ఉద్యోగాలు వంటి స్టాట్యూటరీ బెనిఫిట్స్ ఇవ్వలేకపోయినా, రాష్ట్ర పరిధిలో షెడ్యూల్ క్యాస్ట్ కి ఉన్న నాన్ స్టాట్యూటరీ స్కీమ్స్ కి, షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ని కూడా అర్హులుగా చేయాలని ప్రొఫెసర్ జోసెఫ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు, దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ 2014 సంవత్సరంలో జీవో ఎంఎస్ నంబర్ 25 విడుదల చేసి, దళిత క్రైస్తవులకు, ఎస్సీ కున్న నాన్ స్టాట్యూటరీ బెనిఫిట్స్ ని ఎక్స్ టెండ్ చేసిందని గుర్తు చేశారు.

