పారిశుద్ధ్యంలో ఏలూరు జిల్లాను రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలపాలి
1 min read

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ ఉద్యమం ముందుగా ప్రతీ ఇంటి నుండి ప్రారంభం కావాలి
సింగల్ యూజ్ ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు,స్టీల్ గ్లాసులు వంటి వాటి వినియోగం పెరగాలి
జిల్లా కె. వెట్రిసెల్వి
ఉంగుటూరు మండలం చేబ్రోలులో స్వర్ణ ఆంధ్ర శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాను రాష్ట్రంలోనే స్వచ్ఛ ఏలూరుగా ప్రధమ స్థానంలో నిలిపేందుకు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం చేబ్రోలులోని చెత్త నుండి సంపద సృష్టి కేంద్రంలో శనివారం స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర..కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజలతో గ్రామాలను పరిశుద్ద్యంగా ఉంచుతామని, సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కాఫీ విత్ క్లాప్ మిత్రాస్’ కార్యక్రమంలో క్లాప్ మిత్ర లతో కాఫీ తాగారు. క్లాప్ మిత్రలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిదిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సంపూర్ణ పారిశుధ్యం, ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ప్రజలు అది చేతల్లో చూపినప్పుడే సాధ్యమవుతుందన్నారు.
చేబ్రోలు గ్రామాన్ని దత్తత్త తీసుకుంటా: కలెక్టర్
చేబ్రోలు గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నాని, గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతానని కలెక్టర్ చెప్పారు. చేబ్రోలు గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తానన్నారు. ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ చేబ్రోలు గ్రామం జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య గ్రామంగా అవార్డు అందుకోవడం అభినందించదగిన విషయమన్నారు. చేబ్రోలు కు సుప్రీమ్ లోకల్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు కావడం కూడా అభినందించదగిన విషయమన్నారు. అదే స్పూర్తితో ఉంగుటూరు నియోజకవర్గం స్వచ్ఛ నియోజకవర్గయం రూపొందించేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా చూడాలని, ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరణకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పరిధిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ హోల్ సెల్ అమ్మకందారుల, తయారీ సంస్థలపై లక్ష రూపాయలు జరిమానా, ట్రేడ్ లైసెన్స్ రద్దు, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెత్త నుండి సంపద కేంద్రంలో కలెక్టర్,ఎమ్మెల్యే మొక్కలను నాటారు. అనంతరం కంపోస్ట్ ఎరువుల తయారీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ని,ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుని దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పూర్ణ ప్రసాద్, ఎంపిడిఓ , పంచాయతీ సర్పంచ్ శ్రీనివాస్, సర్పంచ్ లక్ష్మి సునీత, ఉప సర్పంచ్ దుర్గ భవాని, ప్రభృతులు పాల్గొన్నారు.


