బిసి హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
1 min read

మంత్రాలయం, న్యూస్ నేడు : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో ఉన్న బిసి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు థామస్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన సబ్ కలెక్టర్ భరద్వాజ్ ని, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి మాధవరం రాఘవేంద్ర రెడ్డి లకు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు థామస్ మాట్లాడుతూ స్థానిక హాస్టల్ లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. ఆ సమస్యలపై అనేకసార్లు విన్నవించిన ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. బీసీ హాస్టల్ లో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని సరైన మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి అన్నారు. సబ్ కలెక్టర్ స్పందించి విద్యార్థులకు మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసి సరైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

