NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కౌతాళంలో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం

1 min read

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మండల తహసిల్దార్ కి,వినతి

కౌతాళం,  న్యూస్ నేడు: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన  జిల్లా, అధ్యక్షుల,తాలూకా ఆదేశాల మేరకు కౌతాళం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ – ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవంను కౌతాళంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా,ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.అనంతరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ  ఎమ్​ఆర్వో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.మండల అధ్యక్షులు అంజి మాట్లాడుతూ “పత్రికా రంగంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏపీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ అండగా ఉంటుంది జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం కృషి చేస్తుంది” అని తెలిపారు.తాలూకా సహాయ కార్యదర్శి ఆరిఫ్ మాట్లాడుతూ “జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే బలమైన అండ. సమస్యల పరిష్కారం కోసం అందరం ఐక్యంగా ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  గౌరవ సలహాదారు మమ్మద్, ప్రధాన కార్యదర్శి రామాంజి,మండల ఉపాధ్యక్షులు శివకుమార్, సాదిక్, రాముడు, ఫారుక్, కోశాధికారి అనిల్, హుసేని, కార్యవర్గ సభ్యులు ముక్తార్ భాష, రామ్మూర్తి, మహమ్మద్ దనిఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author