మండల స్థాయి అధికారులతో దేవరగట్టు లో సమీక్ష సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పత్తికొండ ఎస్డీపిఓ సూచనలతో దేవరగట్టు బన్నీ ఉత్సవంనకు సంబంధించిన ఏర్పాట్లను సిఐ ఆలూరు మరియు సంబంధిత శాఖలలోని మండల స్థాయి అధికారులతోటి దేవరగట్టు నందు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. సంబంధిత అధికారులు వారికి వారి పై అధికారులు కేటాయించిన పనులను త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా కోరడమైనది. ఈ సమీక్ష సమావేశం నందు పడుగుంద మండల్ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ , ఆలూరు సిఐ శ్రీనివాస్ నాయక్ ,ఎంపిడిఓ హొలగుంద , డిటి , తహసిల్దార్ ఆఫీస్ హొలగుంద, ఏఈ , ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, సంబంధిత వీఆర్ఓ లు, పంచాయితీ సెక్రటరీలు, సిబ్బంది మరియు నెరనికి, నరనికి తాండ, కొత్తపేట గ్రామ పెద్దలు ఎస్ఐ ,బాల నరసింహులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.