NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన  కలెక్టర్

1 min read

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

మోడల్ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

ఆళ్లగడ్డ,  న్యూస్​ నేడు: ఆళ్లగడ్డ మండలం, పడగండ్ల గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 1,వ తరగతి నుంచి 5,వ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారని వీరికి ఒక్కొక్క క్లాస్ కు ఒక టీచర్ ఉన్నారన్నారు. మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కటి విద్యను అందించాలన్నారు. ఆదర్శ పాఠశాల అంటే ప్రతి అంశంలోనూ ఏ గ్రేడ్ లో ఉండాలన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఉపాధ్యాయులు చొరవ తీసుకొని పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మోడల్ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి అన్నారు. ఇకనుంచి పాఠశాలలను తరచూ విజిట్ చేయడం జరుగుతుందని పాఠశాలల్లో అపరిశుభ్రత నెలకొన్నట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అక్కడ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

About Author