వెంకన్న చెరువు సబ్ స్టేషన్ పరిధిలో 30వ తేదీ విద్యుత్ సరఫ నిలిపుదల
1 min read

మధ్యాహ్నం2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ కు అంతరాయం
వినియోగదారులు సహకరించాలని మనవి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ కె.ఎం.అంబేద్కర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఈ నెల 30వ తేదీన ఏలూరు 1 వ పట్టణం లో గల వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్ పరిదిలో గల 11KV చాటపర్రు రోడ్ ఫీడరు కొత్త విద్యుత్ లైన్లు నిర్మించుట నిమిత్తం మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపదల చేయబడునని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. ఎం. అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమయములో వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్ పరిధి లో గల ప్రేమాలయం రోడ్, పెదమాలపల్లి, తూర్పువీధి, గంగానమ్మగుడి ఏరియా, ఫిల్ హౌస్ పేట, చాటపర్రు రోడ్, సాయిబాబా గుడి, శివాలయం ఏరియా పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని, కావున వినియోగదారులు సహకరించవలసినదిగా ఆయన కోరారు.

