NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రికార్డు స్థాయిలో రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం

1 min read

జులై నెల హుండీ ఆదాయం రూ రూ 5 కోట్ల 46 లక్షలు

మంత్రాలయం , న్యూస్​ నేడు:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం చరిత్ర లో కనివినీ ఎరుగని రీతిలో జులై నెల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు తెలిపారు. మంగళవారం హుండీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడంతో మొత్తం రూ 5 కోట్ల 46 లక్షల 6 వేల 555 నగదు, 127 గ్రాముల బంగారం, 1820 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు తెలిపారు. వచ్చిన ఆదాయం తో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

About Author