యోగా తో… ఆరోగ్యం పదిలం
1 min read

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్
కర్నూలు, న్యూస్ నేడు: ప్రతి ఇంటికి యోగ సాధనను తీసుకువెళ్లేలా రాష్ట్ర యోగ సంఘం కృషి చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కర్నూలు పర్యటన నేపథ్యంలో రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యుడు అవినాష్ శెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో యోగాకు మంచి ప్రాచుర్యం కలిగిందంటే కేవలం ప్రధానమంత్రి మోడీతో సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్ర సృష్టించేలా విశాఖపట్నం వేదికగా యోగ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి అనేక రికార్డులను సాధించిందన్నారు. యోగ ఆంధ్ర విజయవంతంలో రాష్ట్ర యోగ సంఘం తో యోగ సంస్థలు కీలక పాత్ర పోషించాయి అన్నారు. అనంతరం యోగ సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి మాట్లాడుతూ యోగ అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తామని అన్నారు. యోగాంధ్ర ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థల పరిధిలో యోగ శిక్షకుల ను నియమించి మంచి ఆరోగ్య సమాజాన్ని నిర్మించేలా చూడాలని బిజెపి అధ్యక్షుడు మాధవ్ ను అవినాష్ శెట్టి కోరారు.

