బీసీ హాస్టల్ కు.. ఫ్యాన్లు పంపిణీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న బీసీ హాస్టల్ కు డాక్టర్ శంకర్ శర్మ ఫ్యాన్లను పంపిణీ చేశారు. బీసీ హాస్టల్ వార్డెన్ రమేష్ డాక్టర్. శంకర్ శర్మ ను కలిసి హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్పందించిన డాక్టర్. శంకర్ శర్మ గాయత్రీ ఎస్టేట్ లోని సాయి గురుదత్త పాలిక్లినిక్ లో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే సీలింగ్ ఫ్యాన్లను వార్డెన్ రమేష్ కు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ధనవంతులు పేదవారికి సహయం చేయాడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. వెనుక బడిన రాష్ట్రంలో దాతలు సహయం చేయాలని ముఖ్యమంత్రి సైతం సూచించినట్లు డా. శంకర్ శర్మ పేర్కొన్నారు.

