ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లపై అధికారులు స్పందించాలి
1 min read

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి
చెన్నూరు ,న్యూస్ నేడు: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పై సంబంధిత అధికారులు హాస్టలను ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహించాలని వైఎస్ఆర్సిపి కమలాపురం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో బాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కమలాపురం నియోజకవర్గం లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లను సందర్శించడం జరిగిందని ఆయన అన్నారు. అందులో భాగంగా చెన్నూరు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని మంగళవారం రాత్రి పరిశీలించి అక్కడ విద్యార్థులతో వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడుతూ, చెన్నూరు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఇప్పటివరకు విద్యార్థులకు మెను ప్రకారం భోజనంలో గుడ్డు అందించడం లేదని విద్యార్థులు చెప్పినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా అక్కడ టాయిలెట్ల సమస్య ఎక్కువగా ఉందని టాయిలెట్లు సక్రమంగా లేవని తెలిపారు. హాస్టల్ భవనానికి సంబంధించి కిటికీలు సక్రమంగా లేకపోవడం వల్ల హాస్టల్ చుట్టూ పొలాలు ఉన్న కారణంగా దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు. కిటికీలు దెబ్బ తిన్న కారణంగా దోమలు ఎక్కువగా హాస్టల్లోకి రావడం జరుగుతుందని దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని అక్కడి విద్యార్థులు వాపోడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా అక్కడి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకుని సమగ్రంగా ఆ సమస్యలను అధ్యయనం చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారికి మెరుగైన వసతులు కల్పించాలనే సంకల్పంతో విద్యా వ్యవస్థను మరింత పట్టిష్టం చేయడం జరుగుతుందని చెబుతున్నదని అయితే అది సక్రమంగా కార్యరూపం దాల్చడం లేదని మాటలకే పరిమితం అయినదే తప్ప, విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని ఆయన ప్రభుత్వాన్ని తీరులను దుయ్యపట్టారు.ఇక్కడే కాదు ప్రతి చోట ప్రభుత్వ హాస్టల్లల్ల్లో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలన్న వారు భయందోలనకు గురవుతున్నారని తర్వాత తమను ఏమైనా అంటారని వారు భయపడుతున్నారని ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. అధికారులు హాస్టలను తనిఖీ చేసి అక్కడ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరడం జరిగింది. హాస్టళ్లకు సంబంధించిన విషయాలను విద్యార్థి విభాగ నాయకులకు చెబితే వారిని అక్కడ సిబ్బంది ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఈ విషయాలు విద్యార్థులు క్షుణ్ణంగా తమకు తెలియజేశారని ఆయన అన్నారు. అధికారులు సమస్యలపైనే కాకుండా, విద్యార్థులతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నప్పుడు వారి సమస్యలు చెప్పడం జరుగుతుందని అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఇది సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారికి మెరుగైన విద్యను అందించే దిశగా కృషి చేయాలని ఆయన తెలిపారు. ఆయనతోపాటు ఉప్పరపల్లి ఎంపీటీసీ నిరంజన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు చంద్రారెడ్డి, మహేష్, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.


