NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాఘవేంద్రుని సన్నిధి లో సినీ నటుడు సాయికుమార్

1 min read

ఘన స్వాగతం పలికిన శ్రీ మఠం అధికారులు

మంత్రాలయం, న్యూస్ నేడు :   ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు ప్రముఖ సినీ నటుడు   సాయికుమార్ మంగళవారం వచ్చారు. వీరికి శ్రీ మఠం  ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్, సహాయ పీఆర్వో హోన్నాళ్ళి వ్యాసరాజ్ ఆచార్  శ్రీ మఠం సాంప్రదాయ పద్ధతిలో ఘన  స్వాగతం పలికారు.వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకొని మహా మంగళారతి వంటి విశేష పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.వీరికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ విఐపి శేషవస్రం కప్పి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి పూర్వాశ్రమ కుమారుడు అప్రమేయాచార్, క్రిష్ణా స్వామి,శ్రీ మఠం ద్వారపాలకులు అనంత స్వామి, ప్రకాష్ స్వామి,పవన్ స్వామి, మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్సై శివాంజల్, కానిస్టేబుల్ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author