స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలి…సిపిఎం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలనుండి దోచి అదానీ ఆస్తులు పెంచడం కోసమే అని సిపిఎం ప్యాపిలి మండల నాయకులు ఎస్.ఎS.చిన్న రహిమాన్ అన్నారు. ఈసందర్భంగా మంగళవారం ప్యాపిలి మండలంలోని జలదుర్గం సబ్ స్టేషన్ ఎదుట జరిగిన ధర్నా కు పద్మశాలి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని ఎస్.ఎ. చిన్న రహిమాన్, అవాజ్ కమిటీ డోన్ నియోజకవర్గం అధ్యక్షులు అబ్దుల్ రసూల్, కెవిపిఎస్ మండల నాయకులు రాజకుమార్, సర్పంచ్ దస్తగిరి మాట్లాడుతూ వ్యాపార సముదాయాలకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లను బిగించడం పూర్తి చేసిన ప్రభుత్వం 200 యూనిట్లు పైబడి విద్యుత్ బిల్లు వచ్చే గృహ వినియోదారులకు ఈ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కుట్ర పండుతున్నారు. యూనిట్కు 40 పైసలు వసూలు చేస్తున్న విధానాన్ని నిలిపివేయాలని తప్పుడు లెక్కలు ఇచ్చి అదనపు చార్జీలు వసూలు చేసిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని తగ్గిస్తామని ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. అధికారంలోకి రాకముందు లోకేష్ తన యువ గళం పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన వారే నేడు అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీట్లను బిగించడం కార్పొరేట్ల లాభాల కోసమే పాలకవర్గాలు అన్నదే స్పష్టంగా కనబడుతుంది అన్నారు. మీటర్ కు అయ్యేఖర్చు 10వేలు నుండి 15,000 వేలు వరకు ఉంటుందని అన్నారు. సెల్ ఫోన్ రీఛార్జ్ మాదిరిగా ఈ మీటర్ బిగిస్తే ముందే బిల్లు కట్టాలి పగులు ఒక రేటు రాత్రి ఒక రేటు పెట్టి ప్రజల నుండి దోపిడీ చేసే ఆదాని లాంటి వారికి కట్టిబెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం వలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు ప్రజలు ముందుగానే డబ్బులు చెల్లించి స్మార్ట్ మీటర్ ను రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు వస్తుందని డబ్బులు అయిపోయిన మరుక్షణమే కరెంటు పోతుందని దీనివల్ల ప్రజలకు నష్టమని అన్నారు. గంట గంటకు కరెంటు చార్జీల రేటు మారడం వలన కరెంటు చార్జీల భారం ప్రజలపై12,771 కోట్ల రూపాయలు విద్యుత్ భారం పడుతుందని ప్రజల కోసం ఆలోచించే ఏ ప్రభుత్వమైనా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తారని అన్నారు. అక్రమంగా గత ప్రభుత్వము చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని పెంచిన కరెంటు చార్జీలన ప్రజల అనుమతి లేకుండా ఇళ్లకు పెడుతున్న స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అభ్యంతరాలు తెలపాలని ప్రజలను కోరారు. అనంతరం జె.ఇ. రామకృష్ణ కి పై సమస్యల పైన వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో అవాజ్ కమిటీ చాంద్ పీరా,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వడ్డే శ్రీనివాసులు, సెంట్రింగ్ మధు, సెంట్రింగ్ సంజీవ, వడ్డే శివ, ఎంఆర్పిఎస్ మల్లన్న, పొట్లూరి రామంజి, కురువ మహేంద్ర ,వై.బి. రవి, నే సా రామచంద్రుడు, గుంత రవి తదితరులు పాల్గొన్నారు.


