NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని కలిసిన నాగమధు యాదవ్

1 min read

కర్నూలు , న్యూస్ నేడు: యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయ్ భాను గారిని దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన నూతనంగా ఎన్నికైనటువంటి  యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగ మధుయాదవ్  మర్యాదగా పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగమధు మాట్లాడుతూ దేశంలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, యువతకు ఉద్యోగ కల్పనకై, సమాజంలో యువత మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజిలేని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్  పార్టీబలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని, ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడతామని, దేశంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నాగమధు  తెలియజేశారు.

About Author