PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రామన పల్లి బీసీ కాలనీలో మద్యం షాపు పెట్టకండి

1 min read

మద్యం షాపు పెట్టడంపై మహిళల ఆందోళన

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  చెన్నూరు మండలంలోని రామనపల్లె గ్రామపంచాయతీ బీసీ కాలనీలో మద్యం దుకాణం పెట్టకూడదని ఆ కాలనీ మహిళలు శనివారం పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ మద్యం షాపు పెట్టడం వల్ల మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అయినా మద్యం దుకాణాలు గ్రామాలకు వెలుపల దూరంగా పెట్టుకోవచ్చు కదా, అని ప్రశ్నించారు. గతంలో మద్యం దుకాణాలు ఇక్కడ పెట్టడం వల్ల మహిళలమైన తామంతా కూడా ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవలసి వచ్చిందని మళ్లీ ఇప్పుడు మద్యం దుకాణం ఇక్కడ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని వారు ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేశారు. కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి చొరవ తీసుకొని ఇక్కడ మద్యం దుకాణం పెట్టకుండా వేరే ఎక్కడైనా పెట్టే విధంగా, ఆ మద్యం దుకాణం యజమానులకు సూచించాలని వారు తెలిపారు. ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే, ఇటు మహిళలు, విద్యార్థులు ఆ మద్యం దుకాణం గుండా వెళ్లాల్సి వస్తుందని అక్కడ ఏవైనా సమస్యలు దొరికితే ఎవరు బాధ్యులు అని వారు మద్యం దుకాణం ఏర్పాటుపైమండిపడుకున్నారు. ఏది ఏమైనాప్పటికీ రామనపల్లి బీసీ కాలనీలో మద్యం దుకాణం వద్దని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మండల ఉన్నతాధికారులు అందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *