ఘనంగా సామూహిక వరలక్ష్మివ్రతం వేడుకలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి సరస్వతీ శిశు మందిరంలో శ్రావణమాసం లో 3వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంనకు ఫణి శర్మ మహిళల చేత వ్రత పూజా చేయించారు. వరలక్ష్మి కథ తెలియచేసారు, అనంతరం 30 మంది మహిళలకు కంకణాలు కట్టారు. మహిళలకు గాజులు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో ప్రబంధకారిణి సభ్యులు వై. పార్థసారథి మరియు కృష్ణా రెడ్డి,బాల,బాలికలు,మాతాజీలు, ఆచార్యులు పాల్గొన్నారు.

