NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా మహా గౌరీ అమ్మవారికి ప్రాతః కాలంలో విశేషంగా అభిషేకం అర్చనలు జరిగినవి.మరియూ శ్రావణ మాస సందర్భంగా మహా గౌరీ అమ్మవారి సన్నిధిలో ఉదయం సామూహిక వరలక్ష్మీ వ్రతములు వైభవంగా జరిగినవి. మరియూ అమ్మవారి సన్నిధిలో  రాహుకాల, దుర్గా పూజ, లలితా సహస్రనామ పారాయణం, లలిత, త్రిశతి,దుర్గ అష్టోత్తర పూజలు  జరిగినవి. తిరిగి సాయంకాలం శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహా గౌరీ అమ్మవారికి ప్రదోషకాల పూజ, లక్ష్మీ సహస్రనామార్చన, విశేషంగా జరిగినవి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనారు.

About Author