అన్ని శాఖల అధికారులు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి
1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాలకు చెందిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం ఈటీపిఎస్ ఆన్లైన్ పోర్టల్ లో డాక్యుమెంట్ అప్లోడ్ చేసే అంశం పై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో, తహసిల్దార్ లతో, ఎంపిడిఓ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాలకు సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనలు,కోర్ ఆర్డర్లు, మెమో లు, జీఓ లు, సర్కులర్ లు, ప్రొసీడింగ్ లు తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లు స్కానింగ్ చేసి ఈటీపిఎస్ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు..తహసీల్దార్లు, ఎంపిడిఓ లు కూడా తమ కార్యాలయాల డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలన్నారు..రియల్ టైం గవర్నెన్స్ లో ఈ ప్రక్రియను నిర్వహించడం జరుగుతోందని, అన్ని శాఖల అధికారులు మూడు రోజుల లోపు డాక్యుమెంట్ ల అప్లోడ్ పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు.. ఈ అంశం పురోగతిపై పర్యవేక్షించాలని కలెక్టర్ డి ఆర్ ఓ ను ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

