NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పి.సి.ఆర్ చట్టం.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లపై అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్  అథారిటీ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి .లీలా వెంకట శేషాద్రి  సూచనల మేరకు ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ప్రధాన అధ్యాపకురాలు డాక్టర్ ఇందిరా ప్రశాంతి  అధ్యక్షతన పి.సి.ఆర్ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లపై అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఎఫ్.ఎ.సి చీఫ్ డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ శివరామచంద్రరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ఎస్సీ ,ఎస్టీల హక్కులను కాపాడడంలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు శాఖ ,ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు .లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించడం మనందరి బాధ్యత అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎం. ఇందిరా శాంతి  మాట్లాడుతూ  కళాశాలలో అందరూ కలిసిమెలిసి ఉండాలని  కులం పేరుతో దూషించడం అలాంటివి చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, అధ్యాపకులు వెంకటస్వామి, ఆర్ కామ్లి నాయక్ , జి .హేమంత్, రోషన్న తదితరులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పైన అవగాహన కల్పించారు.

About Author