13న అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా స్థాయిలో స్థానిక జిల్లా కోర్టు లోని న్యాయ సేవ సదన్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి/జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి.కబర్ధి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు మరియు బ్యాంక్, భూసేకరణ ఇతర సంబంధిత అధికారుల తో జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో కోర్టులలో పెండింగ్ ఉన్న రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు మరియు మోటార్ ఆక్సిడెంట్, సివిల్ కేసులను, భూ సేకరణ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ను సెప్టెంబర్ 13 వ తేదిన నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో ఎక్కువ కేసులు పరిష్కరించేల ప్రత్యేక దృష్టి సారించి ఈ లోక్ అదాలత్ ను విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ అవకాశమును కక్షిదారులు వినియోగించుకోని వారి కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించు కోవాలని కోరారు. కోర్టు మానిటరింగ్ పోలీసు లను కోర్టులలో ఉన్న కేసులను మానిటరింగ్ చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో కర్నూలు మరియు నంద్యాల జిల్లా పోలీసు అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


