జగన్నాథగట్టుకి వెళ్లే రోడ్డు గుంతలమయం..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ స్థానిక పుల్లారెడ్డి కాలేజీ ప్రక్కన జగన్నాథగట్టుకి పోయే రోడ్డు గుంతలమయమై నడవడానికి కూడా ఇబ్బందిగా వుంది. ఈ రోడ్డు వెంట నిత్యం కాలేజీ కి వెళ్లే విద్యార్థులు, కాలనీ వాసులు, జగన్నాథగట్టుకి వెళ్లే భక్తులు చాలా ఇబ్బందులుపడుతున్నారు.ఈ రోడ్డు మీద బురదమట్టి పేరుకుపోయి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ద్విచక్ర వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మహిళలు చిన్న పిల్లలు కూడా నడవలేక కింద జారిపడి ప్రమాదాలకి గురవుతున్నారు. ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపుల కాలువలు లేకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో వర్షపునీరు వెళ్లేమార్గం లేక రోడ్డుమీదకి ప్రవహించి రోడ్డు కోతలకి గురవుతుంది.ఎన్ని మరమ్మత్తులు చేసిన ఉపయోగంలేకుండా వుంది. ఈ సమస్య గురించి కాలనీవాసులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగంలేకుండా పోతుంది. అధికారులు చేపట్టే కంటితుడుపు చర్యలవల్ల ఎలాంటి ఉపయోగంలేకుండా పోతుంది.రోడ్డు సమస్య గురించి తెలియడంతో ఇరిగినేని పుల్లారెడ్డి (పిపిఎస్స్) సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యని అధికారులదృష్టికి తీసుకెళ్లి సమస్య పరిస్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డు సమస్యకి శాశ్వతమైన పరిస్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

