PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ  సభ్యత్వంతో కార్యకర్తలకు గుర్తింపు .. భరోసా – సోమిశెట్టి వెంకటేశ్వర్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర మంత్రివర్యులు  శ్రీ టి.జి.భరత్  ఆదేశాల మేరకు తెలుగుదేశంపార్టీ నాయకులు కౌశిక్  ఆధ్వర్యంలొ నగరంలోని ఎన్.ఆర్.పేట నందు నిర్వహించిన తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు  కర్నూలు పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ , తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వర రావు యాదవ్  ముఖ్యులుగా హాజరుకావడమైనది.ఈ సంధర్బంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు కీ,శే,, శ్రీ నందమూరి తారకరామారావు  తరువాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు  పార్టీని ముందుకు తీసుకు వెళుతూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారని, ఇప్పటికి 70 లక్షల సభ్యత్వంతో బలమైన పార్టీగా ఎదిగిందన్నారు.   ప్రతి కార్యకర్త చెల్లించిన సభ్యత్వ రుసుము మొత్తం తిరిగి కార్యకర్తలకు లబ్ధి చేకూరే విధంగా మన యువ నేత నారా లోకేష్  సరికొత్తగా ఆలోచించి ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టారని, చనిపోయిన ప్రతి ఒక్కరికి గతంలో రెండు లక్షల ఇన్సూరెన్స్ చెల్లించేవారు అయితే దానిని 5,00,000గా పెంచడం ఒక భరోసాగా చెప్పవచ్చు అంతేకాక  మట్టి ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు తక్షణ సహాయం కూడా అందిస్తున్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల ఆశీర్వదం వల్ల టి.జి భరత్  ఎం.ఎల్.ఏ గా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్యులు అయ్యారని, తనను గెలిపిచిన ప్రజల కొసం టి.జి భరత్  ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అను నిత్యం ప్రజల కొసం పాటుపడుతున్నారని అన్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనె ధ్యేయంగా టి.జి.భరత్  కృషి చేస్తున్నారని అన్నారు.

About Author