హొళగుంద ఈబీసీ కాలనీలో కరెంటుకోత సమస్య తీర్చిన ఎస్ఐ
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక ఈబిసి కాలనిలో శుక్రవారం నాడు రాత్రి 9:30 గంటల నుండి అర్థరాత్రి 1:15 గంటల వరకు ఏర్పడిన విద్యుత్ అంతరాయంతో కాలనీవాసులు అర్థరాత్రి వరకు చీకటి మరియు దోమలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరెంటు కోతతో సతమతమవుతున్న ప్రజల విద్యుత్ సమస్యను తెలుసుకున్న హొళగుంద సబ్ ఇన్స్ పేక్టర్ శ్రీ దిలీప్ కుమార్ గురజాల మానవతా హృదయంతో సామాజిక సేవలో తనవంతు బాధ్యతగా సత్వరమే స్పందించి, మండల కరెంటు ఏ.ఈ కి ఫోను ద్వారా విద్యుత్ సమస్యను తెలిపి పిల్లలు వృద్దులు ప్రజలు మహిళలు చీకట్లో ఇబ్బంది పడుతున్నందున సాధ్యమైనంత త్వరితగతిన విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరగా, అందుకుగాను అర్ధరాత్రి పూట కూడా సానుకూలంగా స్పందించినటువంటి విద్యుత్ ఏ.ఈ రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో విద్యుత్ సిబ్బందిని పంపి సదరు విద్యుత్ సమస్యను తీర్చడం జరిగింది.తదనంతరం ఈబీసీ కాలనీవాసులు, ప్రజలు సబ్ ఇన్స్ పేక్టర్ శ్రీ దిలీప్ కుమార్ గురజాల కి ప్రత్యేకంగా కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

