విద్యుత్ పరికరాలన్నీ మానవుని అభివృద్ధికి తోడ్పడుతున్నాయి
1 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇండస్ట్రియల్ ఇంజనీర్ శ్రీనివాసరావు
సెయింట్ తెరిసా మహిళ కళాశాలలో కార్యక్రమాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: 2025 ఆగస్టు 28 మరియు 29 తేదీలలో స్థానిక సెయింట్ థెరెసా మహిళా స్వయంప్రతిపత్తి కళాశాలలోని ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం వారు ” దైనందిన జీవితంలో విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్స్ అనువర్తనాలు ” అనే అంశంపై ఒక కార్యాశాలని నిర్వహించారు. ఏలూరులోని ఇండస్ట్రియల్ ఆటోమేషన్ వర్క్స్ సీనియర్ ఇంజనీర్ శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా విచ్చేసి ఏసీ,డీసీ జనరేటర్లు, మోటార్లు, మరియు టోరింగ్ సాంకేతికతను గురించి ప్రయోగాత్మకంగా ప్రదర్శించి వివరించారు. ఆయన తన ప్రసంగంలో విద్యుత్ ప్రవాహం ద్వారా పనిచేసే లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, వైద్య పరికరాలు, లాంటి అనేక పరికరాలు విద్యుత్ అనువర్తనాలే అన్నారు. ఈ పరికరాలన్నీ మన జీవితంలో భాగమై ఆధునిక జీవితాన్ని సులభతరం చేసి మానవుని అభివృద్ధికి తోడ్పడుతున్నాయి అన్నారు. కార్యశాలలో భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థినులు పాల్గొని పరికరాలను నిర్వహించే విధానం, వాటిలో సమస్యల పరిష్కారం, నూతన పరికరాలను పెంపొందించడం మొదలైన అంశాలపై ప్రయోగాత్మక నైపుణ్యాలను,అవగాహనను పెంపొందించుకున్నారు. ప్రిన్సిపల్ డాక్టర్:సిస్టర్ మెర్సీ ఆధ్వర్యంలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్:కె. శ్రీలత, అధ్యాపకులు దీప్తి భార్గవ, పి.అనూష , మరియు మాధురి రోజ్ లు నిర్వహించారు. నిర్వాహకులను వైస్ ప్రిన్సిపల్ డాక్టర్:సిస్టర్ సునీలారాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్:సిస్టర్ సుశీల యు ఇతర అధ్యాపకులు అభినందించారు.


