4వ వార్డులో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల కేంద్రంలోని నాలుగో వార్డులో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు మరియు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్ డి పి ఐ నాలుగో వార్డ్ బ్రాంచ్ కమిటీ సభ్యులు గురువారం పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాలనీలో వేళాపాళా లేకుండా కుళాయి నీళ్లు రావడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే కొళాయి పైపులైన్లలో తుప్పు పట్టి కులాయి పైపుల నుండి నీళ్లు వృధాగా పోతున్నాయని దీని ద్వారా కాలనీకి వెళ్లే రహదారి సైతం ఇబ్బందికరంగా ఉందని వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టి కొళాయి పైపులైన్లు కొత్తవి వేసి కాలనీవాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు పంచాయతి సెక్రటరీని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులతోపాటు సభ్యులు అబ్రార్, ఎం, రహమతుల్లా, చికెన్ బక్షి, హెచ్, కైఫ్ ఎం, వాజిద్, కే, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.