NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెరికల్చర్ సాగుకు రత్తయ్య సేవలు ఆదర్శనీయం

1 min read

జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ ​నేడు:   దెందులూరు మెట్ట గ్రామాల్లో పట్టుపురుగుల పెంపకం సాగుకు దెందులూరు మండలం సెరికల్చర్ టెక్నికల్ అసిస్టెంట్ జి. రత్తయ్య సేవలు ఆదర్శనీయమని సెరికల్చర్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసు అన్నారు. శుక్రవారం దెందులూరు మండలం టెక్నికల్ అసిస్టెంట్ జి రత్తయ్య ను రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ రామరాజు ఎస్ఓ రమేష్ ఇన్స్పెక్టర్ జెపి సూపర్నెంట్ జయశ్రీ పోలవరం ఎమ్మెల్యే తండ్రి చెర్రీ కృష్ణయ్య విద్యుత్ శాఖ జే ఈ జె సత్యనారాయణఘనంగా సత్కరించారు జ్ఞాపికను అందజేశారు. గత ఐదేళ్లలో దెందులూరు మండలంలో మెట్ట గ్రామాల్లో పట్టుపురుగుల పెంపకం ప్రోత్సాహం రైతులకు అవగాహన యూనిట్ల స్థాపనకు అధికారిగా కాకుండా సొంత పనిలా విధులు నిర్వహించిన రత్తయ్య సేవలను సెరికల్చర్ డిపార్ట్మెంట్ సాగుచేసిన రైతులు మెట్ట ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరువరున్నారు. రామారావు గూడెం మాజీ సర్పంచ్ కాలనీరు ఎంపీటీసీ ఖాళీ ఇశ్రాయేలు పలువురు పట్టుపురుగుల రైతులు ప్రజాప్రతినిధులు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ కు ప్రభుత్వం నుంచి మంజూరు అయినా  అన్ని పత్రాలను టెక్నికల్ అసిస్టెంట్ అత్తయ్యకు జిల్లా అధికారులు అందజేశారు. అనంతరం టెక్నికల్ అసిస్టెంట్ రత్తయ్య మాట్లాడుతూ తన విధి నిర్వహణలో ప్రోత్సహించిన అధికారులు ఎస్ ఓ లు సచివాలయ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు జిల్లా కార్యాలయ సిబ్బంది సహకరించిన రైతులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అందరికీ తాను రుణపడి ఉంటాను అన్నారు.కుటుంబ సభ్యులు గణ సన్మానం ఉద్యోగ విరమణ చేసిన టెక్నికల్ అసిస్టెంట్ రత్తయ్యను బావమరుదులు పి శ్రీను పి సూర్యనారాయణ అల్లుడు కూతురు జి లలిత శివశంకర ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

About Author