దేవాలయాల్లో పోటెత్తిన భక్తులు
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు : కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పలు దేవాలయంలో భక్తులు పోటెత్తారు. ఆత్మకూరు రహదారిలో నల్ల కాలువ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో గల నల్లమల లో వెలిసిన రుద్రకోడు దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. బిల్వార్చన, అభిషేకాలు, కుంకుమార్చన కోటి దీపోత్సవాలు భజనలు మొదలు కార్యక్రమాలను దేవాలయ ధర్మకర్త మండలి నిర్వహించారు. వెలుగోడు తెలుగుగంగ 1ఆర్ తూమ్ వద్దగల సర్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేపట్టారు. గండిపేట నందుగల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.