NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు..

1 min read

కేజీఎన్ అబ్దుల్ గఫార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  మహ్మద్ ప్రవక్త 1500 సం.ల జన్మదిన వేడుకలను నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కేజీఎన్ టైల్స్ మరియు గ్రానైట్స్ అధినేత సయ్యద్ అబ్దుల్ గఫార్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈద్-ఎ- మిలాదున్ నబి కార్యక్రమాన్ని కేజీఎన్ టైల్స్ దగ్గర నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ప్రేమతో ఐక్యమత్యంగా ఉండాలని పగలు ద్వేషాలు మనస్పర్ధలు లేకుండా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకొని మహమ్మద్ ప్రవక్త ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ మన జీవితాలను దన్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సయ్యద్ నయీముద్దీన్ ఖాద్రి, అబ్దుల్ గఫార్ అన్నారు. తర్వాత మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో ప్రజలు మైనార్టీ సోదరులు భారీగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో  సయ్యద్ రుక్మద్దీన్,అబ్దుల్ ఖాదర్,శంషుద్దీన్,మాలిక్ భాష,ఉమానుల్లా తదితరులు పాల్గొన్నారు.

About Author