NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయ వృత్తి విశిష్టమైంది..

1 min read

మాట్లాడుతున్న టీచర్ చంద్రకళ

చాగలమర్రి, న్యూస్​ నేడు:  సమాజంలోని వృత్తులన్నిటిలో  ఉపాధ్యాయ వృత్తి ఎంతో విశిష్టమైందని టీచర్ చంద్రకళ అన్నారు. శుక్రవారం పూర్వ ప్రాథమిక విద్య పాఠశాల నందు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ తల్లిదండ్రులు, తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తా రన్నారు. పుస్తక పఠనం ద్వారా  జీవిత విలువలు కూడా నేర్పి   మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ప్రధానోపాత్ర పోషిస్తారని అన్నారు. భారతదేశ రెండవ రాష్ట్రపతి , మొదటి ఉప రాష్ట్రపతి పదవిలో కొనసాగిన గొప్ప విద్యావేత్త పండితుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఉన్నత స్థానం కల్పించి పుస్తక జ్ఞానంతో పాటు క్రమశిక్షణ నేర్పించడం గురువు బాధ్యత అన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తును రూపొందించుకోవడంలో ఉపాధ్యాయులు ముఖ్యపాత్ర పోషిస్తారు అన్నారు. ఉపాధ్యాయులను స్మరించుకోవడం దినోత్సవ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యారంగంలో ఉపాధ్యాయులు చేసిన కృషి, అంకితభావాన్ని గౌరవిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

About Author