NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నసమారాధన కార్యక్రమం..

1 min read

హాజరై ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు

యువత ఆధ్యాత్మిక భావనతో సమాజ సేవ చేసినప్పుడే దైవాశీస్సులు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు:   అన్ని దానాల్లో అన్నదానం మిన్న అని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరు నియోజకవర్గంలోని స్థానిక 15 డివిజన్ మహేశ్వర కాలనీ లో గణపతి నవరాత్రుల మహోత్సవములు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు వందలాదిమందికి అన్న ప్రసాద వితరణ చేయడం మంచి విషయమని పేర్కొన్నారు.యువత ఆధ్యాత్మిక భావనతో సమాజ సేవ చేసే వారికి,మానసిక శక్తి సిద్ధించడంతోపాటు దైవాశిస్సులు,సేవా దృక్పథం అలబడుతుందని రెడ్డి అప్పలనాయుడు అన్నారు, అన్న ప్రసాద వితరణకు ముఖ్యఅతిథిగా మాకు అవకాశం ఇచ్చిన నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి నవరాత్రులను ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ, లోక రక్షణ కోసం పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని అప్పుడే మనమంతా ఐక్యమత్యంతో భాషా విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటామన్నారు, సర్వవిజ్ఞాలను తొలగించే ఆ గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గంచీరి రాజా,   వసంత అశోక్, జి.యేసురాజు,నిడిగట్టు నాగరాజు,నక్క వరప్రసాద్, పి.శివ,నాగ శ్రీనివాస్,సాయి, గుడివాడ సతీష్,బెజవాడ ప్రవీణ్,స్థానిక నాయకులు ఈపిజర్ల మణిరాజ్,ఈపిజర్ల కాశీ తదితరులు పాల్గొన్నారు.

About Author