ఎస్సి బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన అధికారులు…
1 min read

విద్యార్థి సంఘాల వినతులు స్పందించిన అధికారులు…
హొళగుంద న్యూస్ నేడు : స్థానిక మండల కేంద్రలోని బాలుర ఎస్సీ వసతి గృహాన్ని పునఃప్రారంభం చేయాలని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు సబ్ కలెక్టర్ గారికి పిర్యాదు చేయగా స్పందించిన అధికారులు వసతిగృహాన్ని పరిశీలించడానికి సహాయ సాంఘిక సంక్షేమ అధికారి వెంకటరముడు, డిప్యూటీ తహశీల్దార్ ముకుందరావు, విఆరో మల్లేష్ ,సంక్షేమ అధికారులు నాగముద్దయ్య, సిద్ధప్ప లు మాజీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు పర్యవేక్షించారు.పరిశీలించిన అధికారులు వసతి గృహం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అని కొన్ని చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయని అన్నారు. అన్ని విషయాలను పై అధికారులకు నివేదికను పంపుతాం అన్నారు. విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలొనే ప్రారంభం అయ్యేలా చూడాలని కోరారు.వారు స్పందించి అన్ని విషయాలు పై అధికారులకు తెలియజేసి త్వరగా ప్రారంభించేలా చేస్తాం అని అన్నారు. స్పందించిన అధికారులకు భారత విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నాయకులు,సి.ఐ.టి.యు నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.


