NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిఐటియు మండల కమిటీ ఎన్నిక

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  సిఐటియు ప్యాపిలి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో సిఐటియు రెండవ మండల మహాసభ లు నిర్వహించారు.ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం,జిల్లా కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి హాజరు అయ్యారు.ఈ మహాసభలలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా పి.రామాంజనేయులు,ఉపాధ్యక్షులుగా రంగస్వామి,నెట్టేకల్,ప్రధాన కార్యదర్శిగా ఎస్,ఎ.చిన్న రహిమాన్,సహాయ కార్యదర్శులుగా పద్మశాలి శ్రీనివాసులు,రామనాయుడు, కోశాధికారిగా యు.లక్ష్మణ్,కమిటీ సభ్యులుగా మధు,వి.శ్రీనివాసులు,ఓబులేసు, హసేన్, ఓబుళపతి,శ్రీనివాసులు,లక్ష్మీదేవి,కృష్ణవేణి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శులు పి.రామాంజనేయులు, ఎస్.ఎ.చిన్న రహిమాన్ లు మాట్లాడుతూ కార్మిక కర్షక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని సిఐటియు బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.

About Author