NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

22 నుంచి చెన్నూరు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు : మండల కేంద్రమైన చెన్నూరు బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22వ తేదీ నుంచి వచ్చే నెల3.తేదీవరకునిర్వహించేందుకు చెన్నూరు ఆర్యవైశ్య సంఘం కమిటీ ఏర్పాట్లు పూర్తి చేశారు. చెన్నూరులో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాల నిర్మించేందుకు 18- 6- 2002 ఆర్య వైశ్యులు కమిటీగా ఏర్పడి శంకుస్థాపన నిర్వహించారు.23-5- 2010 న శ్రీ మత్కన్యకా పరమేశ్వరి దేవి( శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి) విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.22న సోమవారం అమ్మవారి శాలలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం.23న మంగళవారం శ్రీ భవానీ దేవి అలంకారం.24న బుధవారం శ్రీ మీనాక్షి దేవి అలంకారం.25న గురువారం శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం.26న శుక్రవారం మధ్యాహ్నం వన విహారి నీ దేవి అలంకారం. తోట ఉత్సవం. రాత్రికి శ్రీ పార్వతీ దేవి అలంకారం. నిర్వహించనున్నారు.27న శనివారం శ్రీ గజలక్ష్మి దేవి అలంకారం నిర్వహిస్తున్నారు.28న ఆదివారం శ్రీ శారదా దేవి అలంకారం.29న సోమవారం( బిందెసేవ) మూల నక్షత్రం శ్రీ సరస్వతి దేవి అలంకారం ఏర్పాటు చేశారు.30న మంగళవారం మహిషాసుర మర్దిని దేవి అలంకారం 1. తేదీన బుధవారం చండీ హోమం మహా పూర్ణాహుతి మధ్యాహ్నం 12:30 గంటలకు కన్యకల పూజ. రాత్రి శ్రీ గాయత్రీ దేవి అలంకారం నిర్వహిస్తున్నారు. రెండో తేదీన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు శమీ దర్శనం రాత్రి 9 గంటల నుంచి అమ్మవారు శ్రీ విజయలక్ష్మి దేవి అలంకారంతో గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. శుక్రవారం 11 గంటలకు వసంతోత్సవం రాత్రి అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అలంకారం( డోలాది రోహణం) నిర్వహిస్తున్నారు.

About Author