NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు

1 min read

ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రోత్సాహక చెక్కులు

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల,న్యూస్​ నేడు: ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో చదివి నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ప్రణయ్ బాబు, నితీష్ నాయక్‌లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అభినందించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ లో మెడిసిన్ పొందిన విద్యార్థులను అభినందిస్తూ ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రోత్సాహక చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ చిన్నటేకూరులోని ఏపీఆర్జేసీ స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివి, అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఐఐటి మెడికల్ అకాడమీలో ఇంటర్ కోర్సుతో పాటు నీట్ కోచింగ్ ద్వారా మెడికల్ సీట్లు సాధించారన్నారు. ప్రణయ్ బాబుకు తిరుపతి SV మెడికల్ కళాశాల, నితీష్ నాయక్‌కు అనంతపూర్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీట్లు పొందారన్నారు. మెడిసిన్ సీట్లు పొందిన విద్యార్థులు కళాశాలలో తోటి విద్యార్థులు, సీనియర్‌ విద్యార్థులతో అన్యోన్యతతో మెలిసి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను సూచించారు. ఈనెల 22 నుండి ప్రారంభం కానున్న క్లాసుల కోసం మెడిసిన్ పుస్తకాలు, అవసరమైన మెటీరియల్ కొరకు కలెక్టరేట్ రిజర్వ్ ఫండ్ నుండి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహక చెక్కులను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఐ. శ్రీదేవి, ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఫిజిక్స్ లెక్చరర్ ఉమామహేశ్వరప్ప విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author