బ్రాహ్మణుల అభ్యన్నతికి కృషి
1 min read

ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఆనంద రావు, శ్రీనివాస రావు
- సర్వసభ్య సమావేశంలో తీర్మానం పొందిన పలు అంశాలు
కర్నూలు, న్యూస్ నేడు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఆనంద రావు, శ్రీనివాస రావు. శనివారం నగరంలోని సంకల్ భాగ్ లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నగర బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. అనంతరం పలు అంశాలపై సజావుగా చర్చ జరిగిన అనంతరం తీర్మానించారు. ఆ తరువాత ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఆనందరావు, శ్రీనివాస రావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ డబ్ల్యూ సీతారాం ఎండీ , చంద్రశేఖర్ కల్కూర గాడి చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు, డాక్టర్ వేణుగోపాల్ అఖిల భారతీయ బ్రాహ్మణ నిత్యాన్న సత్రం ప్రధాన కార్యదర్శి, కె వి సుబ్బారావు విశ్రాంత పోస్టల్ సూపర్ సూపర్డెంట్, ఎన్ రామరాజు మాజీ అధ్యక్షుడు ఏపీ బి ఎస్ ఎస్, కొలుకుల చంద్రశేఖర్ దేవి ఫంక్షన్ ప్యాలెస్ అధినేత, మరియు కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షులు చెరువు వెంకట దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి చల్ల నాగరాజు శర్మ , ఉపాధ్యక్షులు కంచుగంటల శ్యామ్ సుందర్ రావు , ఉప కార్యదర్శి నాగులవరం రాజశేఖర్ , కోశాధికారి సిఎస్ ప్రసాదరావు, గౌరవ సలహాదారు టీవీ రవిచంద్ర శర్మ, కృష్ణ జ్యోతి , మామిళ్ళపల్లి రాజేష్ శర్మ , సముద్రాల శ్రీధర్ , హరి శర్మ, శ్రీనివాస రాజు తదితరలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సభ్యులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు నగర బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సండేల్ చంద్ర శేఖర్ తెలిపారు.


