విశ్వబ్రహ్మ సేవా సంఘం అధ్యక్షులు జాలవాడి శ్రీనివాసులుకు ఘనంగా సన్మానం
1 min read

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు తాలూకా విశ్వబ్రహ్మ సేవా సంఘం నూతన అధ్యక్షులు జాలవాడి శ్రీనివాసులును స్థానిక కార్యాలయలో ఆయన శిష్య బృందం సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా శిష్య బృందంలోని సభ్యులు బోడబండ నరసింహులు మాట్లాడుతూ జాలవాడి శ్రీనివాసులు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి ఆధరణ పొందారాన్నారు. సేవగుణం గల జాలవాడి శ్రీనివాసులు ని ఆ సంఘం నాయకులు అధ్యక్షులుగా ఎన్నుకోవడం తమకు ఎంతో గర్వకారణం అన్నారు. ఇటువంటి పదవులు మరెన్నో పొందాలని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గువ్వలదొడ్డి శ్రీనివాసులు, రవికుమార్, సురేష్ ఆచారి ఈశ్వరయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు.

