NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థుల ప్రాణాలు కలెక్టర్ గారే కాపాడాలి

1 min read

మామూళ్ల మత్తులో జిల్లా విద్యాశాఖ అధికారులు

పాఠశాలల్లోకి డిప్యూటీ డిఈఓ సైతం ప్రైవేటు పాఠశాల యాజమాన్య అనుమతి తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆగ్రహం

ఎమ్మిగనూరు పట్టణ మండల విద్యాశాఖ అధికారి అంజనేయులు గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి

ఎమ్మిగనూరు న్యూస్ నేడు:  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం నందు ప్రైవేటు పాఠశాలలు సరైన విద్యాశాఖ నియమ నిబంధనలు ప్రమాణాలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకొని పట్టణంలో రకీబ్ భాష లాంటి విద్యార్థుల ప్రాణాలకు కలెక్టర్ గారే రక్షణ కల్పించాలని కర్నూల్ కలెక్టరేట్ గాంధీ విగ్రహం  ముందు విద్యార్థుల సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ డా” సిరి కి వినతి పత్రాన్ని అందజేసిన విద్యార్థి సంఘ  జేఏసీ నాయకులుఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు ఉదయ్, శేఖర్, ఖాజా, ఆఫ్రిది, రఘునాథ్ మాట్లాడుతూకర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం నందు సుమారు 42 ప్రైవేటు పాఠశాలలు కలవు ఈ పాఠశాలలో విద్యాశాఖ నియమ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా ఇష్టానుసారంగా పాఠశాలలను నిర్వర్తిస్తు ఉన్న విద్యాశాఖ అధికారులు వీటిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అని గత కొన్ని రోజులుగా ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుని విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సరైన ప్రమాణాలు లేని పాఠశాలలను సీజ్ చేయాలని దశలవారీగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు వీటిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమైన చర్య గత నెల రోజులుగా విద్యార్థుల సంఘాల జేఏసీ గా ఎమ్మిగనూరు పట్టణంలో  విద్యాశాఖ నియమ నిబంధనలు పాటించని రవీంద్ర భారతి పాఠశాల, ముబారక్, శ్రీరామ, సెయింట్ జోసెఫ్, రవీంద్ర విద్యానికేతన్, స్టార్ కిడ్స్, శారద పాఠశాల, లిటిల్ ఫ్లవర్, శ్రీ చైతన్య, గ్రీన్ ల్యాండ్,లాంటి మరో 42 పాఠశాలలు పట్టణంలో కలవు ఈ పాఠశాలలో విద్యాశాఖ ప్రమాణాలు అయినా జీవో నెంబర్  ఎమ్మెస్1, జీవో నెంబర్ 74,పాఠశాలప్రారంభించడానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాలకు సమర్పించిన ఏ ప్రమాణాలను కూడా పాటించట్లేదు అన్ని వారు ఆవేదన వ్యక్తం చేశారు.డిప్యూటీ డిఇఓని ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు అనుమతించకపోవడం సిగ్గుచేటుగా భావిస్తూ విద్యార్థి సంఘాలుగా ఉద్యమం చేయడం జరిగింది తక్షణమే ఈ పాఠశాలలపై చర్యలు తీసుకుంటూ రేకుల షెడ్లలో పాఠశాల నిర్వహిస్తున్న వాటిని మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలపై చర్యలు తీసుకుని  సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రఫీ, నవీన్ ,అశోక్ ,కలం వీరేష్, నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

About Author