NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“ఫార్మకో విజిలెన్స్ వారోత్సవాలు”…

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  అవగాహన పోస్టర్ విడుదల చేసిన అడిషనల్ డియం.ఇ & ప్రిన్సిపల్ డా. కె. చిట్టి నరసమ్మ …. ఫార్మకాలజీ విభాగము…    కర్నూలు మెడికల్ కాలేజీలోని ఫార్మకాలజీ విభాగము లోని “ఔషధ దుష్ప్రభావాల  పర్యవేక్షణ కేంద్రం” ఆధ్వర్యంలో  ఈనెల 17 నుండి 23 వరకు నిర్వహిస్తున్న 5 వ జాతీయ ఫార్మకో విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా అవగాహన గోడ పత్రికను అడిషనల్ డి. యం.ఇ & మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.కె.చిట్టి నరసమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మందుల వల్ల ఏదైనా దుష్ప్రభావాలకు  గురి అయితే టోల్ ఫ్రీ నంబర్ 1800-180-3024 కు ఫోన్ చేయాలని లేదా ఫార్మకాలజి విభాగం ఏఎంసి సెంటర్ కు తెలపాలని కోరారు. ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ఈ  5వ జాతీయ వారత్సవాల థిమ్ ఏమనగా మీ ఆరోగ్య భద్రత ఒక క్లిక్ దూరం లో పివీపిఐ కి నివేదించడమని తెలిపారు. ఈ వారోత్సవాల సందర్భంగా మందుల వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన , వక్తృత్వ పోటీలు నిర్వహించామని తెలిపారు. ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డా.ఉషారాణి, అసోసియేట్ లు డా   రాజేశ్వరమ్మ, డా.రజనీకాంత్, అసిస్టెంట్ లు డా. బాను ప్రకాశ్, డా.హరిత, డా రమ్య, డా  అల్తాఫ్ డా.రాజ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author