NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆశ్రమం హాస్పటల్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవం

1 min read

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు జిల్లా ఎస్పీ కె.శివప్రతాప్ కిషోర్

ధూమపానం,మద్యపానం ఆరోగ్యానికి హానికరం ప్రతిరోజు వ్యాయామం అవసరం

మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులతో గుండెను సంరక్షించుకోవచ్చు

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు  : ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ఆశ్రమ వైద్య కళాశాల వారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరు జూటు మిల్లు ప్రాంతం నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు వాక్ మార్తాన్  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ హాజరయ్యారు.జూట్ మిల్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు వాక్ మార్తాన్ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించినారు.ఈ కార్యక్రమములో జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్  మాట్లాడుతూ గుండె ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు కీలకం.

మీ గుండెను రక్షించుకోవడానికి తీసుకోదగిన చర్యలు:

ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,లీన్ ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. ఉప్పు,చక్కెర, సంతృప్త కొవ్వులు మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించండి.క్రమం తప్పకుండా వ్యాయామం:ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు మధ్యస్థ తీవ్రత కలిగిన వ్యాయామం చేయాలన్నారు. నడక, జాగింగ్, సైక్లింగ్, ఈత వంటివి గుండె ఆరోగ్యానికి క్షేమదాయకమన్నారు.పొగత్రాగడం మరియు మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్నారు. చెడు వ్యసనాలు మానుకోండి,ధూమపానం మరియు అధిక మద్యపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. వీటిని పూర్తిగా మానేయడం లేదా పరిమితం చేయడం గుండెకు ఎంతో మేలు చేస్తుందన్నరు.ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి,అధిక బరువు లేదా ఊబకాయం గుండెపై అదనపు భారాన్ని మోపుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నరు.రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణ,క్రమం తప్పకుండా రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేయించుకోవాలని సూచించారు. అవసరమైతే వైద్యుల సలహా మేరకు మందులు వాడలన్నారు.మధుమేహం నియంత్రణ మీకు మధుమేహం ఉంటే, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఒత్తిడిని తగ్గించుకోండి.

దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయన్నారు.క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు: సంవత్సరానికి ఒకసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకోవచ్చు.ఈ వాక్ మార్తాన్ లో జిల్లా ఎస్పీ తో పాటు గా ఆశ్రమ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్: హనుమంతరావు, సి ఓ వో డాక్టర్ రాజ రాజన్, డాక్టర్ తమ్మీ రాజు, ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్, ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు,పోలీస్ సిబ్బంది, ఏలూరు పట్టణంలో ఉన్న వాకర్ అసోసియేషన్ సభ్యులు మరియు  ఆశ్రమ వైద్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author