NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆక్యూపంక్చర్ బోర్డును వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి

1 min read

ఎస్పా భారత్

విజయవాడ , న్యూస్​ నేడు: నగరంలోని అశోక్ నగర్ లో గల ఇండియన్  ఓం  కేంద్ర కార్యాలయంలో ఎస్పా భారత్ (ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీప్రాక్టిషనర్ అసోసియేషన్ ఆఫ్ భారత్ ) సభ్యులు డాక్టర్ మాకాల సత్యనారాయణ అధ్యక్షతన సమావేశమైనది అక్యూపంక్చర్ అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని తీర్మానించినారు.కేంద్ర ప్రభుత్వం అక్యుపంక్చర్ ప్రత్యేక విభాగ చికిత్సగా గుర్తించి బోర్డు ఏర్పాటుతో చర్యలు చేపట్టాలని నిర్ణయించి సంవత్సరమయిందని,ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవని,దేశ ఆరోగ్యం,పేదరిక తగ్గింపును దృష్టిలో పెట్టుకుని త్వరిత నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరల్డ్ ఆక్యుపంక్చర్ డే ను 15 రోజుల ఉత్సవాలుగా జరపాలని మరియు విశిష్ట కృషి చేసిన వారికి అవార్డ్స్ ఇవ్వాలని తీర్మానించడం అయినది . ఈ సందర్భంగా ఏర్పాటైన ఆరోగ్య శిబిరాన్ని ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ రాజారావు  ప్రారంభించారు. అక్యుపంక్చర్ అభివృద్ధికి విశిష్ట కృషి చేస్తున్న ఎస్పా భారత్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ ని సభ్యులు సన్మానించారు.

About Author