ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్తినారి-స్వశక్తి పరివార్ ఆరోగ్య శిబిరం
1 min read

ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రా బాలరాజు
మహిళల ఆరోగ్యం బలమైన కుటుంబానికి పునాదికి నాంది
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల శ్రేయస్సు కోసం అనేక పథకాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ‘స్వస్థ్ నారి-సశక్త్ పరివార్ అభియాన్’ ఆరోగ్య శిబిరాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తరువాత సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ-మహిళల ఆరోగ్యం బలమైన కుటుంబానికి పునాది అని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శ్రేయస్సు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ శిబిరాల ద్వారా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


