NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధాని ప‌ర్యట‌న ఏర్పాట్లు ముమ్మరంగా జ‌రుగుతున్నాయి.. రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రధాని న‌రేంద్రమోడీ క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు ముమ్మరంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌న్నూరు టోల్ ప్లాజా స‌మీపంలోని రాగ‌మ‌యూరి వ‌ద్ద జ‌రుగుతున్న ఏర్పాట్లను ప్ర‌ధాని ప్రోగ్రాం స్పెషల్ ఆఫీస‌ర్, సీనియ‌ర్ ఐఏఎస్ వీర పాండియ‌న్‌తో క‌లిసి మంత్రి ప‌రిశీలించారు. ముందుగా స్టేజీ వ‌ద్ద జ‌రుగుతున్న ప‌నుల వివ‌రాలు తెలుసుకున్నారు. అనంత‌రం గ్యాల‌రీ నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఆదోని స‌బ్ క‌లెక్టర్ మౌర్య భ‌ర‌ద్వాజ్ జ‌రుగుతున్న ప‌నుల‌ వివ‌రాలు వెల్లడించారు. హెలిప్యాడ్, వీవీఐపీ రోడ్లు, వీవీఐపీ పార్కింగ్ ప‌నులు, ప‌బ్లిక్ వ‌చ్చేందుకు రోడ్లు, వాహ‌నాల పార్కింగ్ ప‌నుల పురోగ‌తిని తెలుసుకున్నారు. నిర్దేశించిన గ‌డువు క‌న్నా ముందే ప‌నులు పూర్తయ్యేలా చూడాల‌ని అధికారులు, కాంట్రాక్టర్లను  ఆదేశించారు. అనంత‌రం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విధులు కేటాయించిన ఐఏఎస్ అధికారుల‌తో మంత్రి మాట్లాడారు.

About Author