మాజీమంత్రి పెద్దిరెడ్డిని కలిసిన మోమిన్ మన్సూర్..
1 min read
పల్లెవెలుగు , మిడుతూరు: వైఎస్సార్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్ మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్కే ఫంక్షన్ హాల్ లో జరిగిన జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు.మన్సూర్ కు (వైఎస్సార్ టియుసీ)పదవి వచ్చిన సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని శాలువా పూల బోకేతో ఘనంగా సత్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దారా సుధీర్ ను మన్సూర్ సన్మానించారు.ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం చెందిందని వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మన్సూర్ కు సూచించారు.రీజనల్ కోఆర్డినేటర్ మరియు డాక్టర్ సుధీర్ మన్సూర్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,నాగ తులసి రెడ్డి,నాగార్జున రెడ్డి,మల్లేశ్వర రెడ్డి,రమణ పాల్గొన్నారు.

