NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెగాస‌స్ కు అమెజాన్ షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పెగాస‌స్ సాఫ్ట్ వేర్ రూపొందించిన ఎన్ఎస్వో గ్రూప్ కు అమెజాన్ వెబ్ స‌ర్వీస్ షాక్ ఇచ్చింది. ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ కు అందిస్తున్నా మౌలిక వ‌స‌తుల‌ను, ఖాతాల సేవ‌ల‌ను నిలిపివేసింది. అమెజాన్ వెబ్ స‌ర్వీస్ సేవ‌ల‌ను 50 వేల ఫోన్లను హ్యాక్ చేయ‌డానికి ఎన్ఎస్వో గ్రూప్ ఉప‌యోగించిందని బ‌య‌ట‌ప‌డటం సంచ‌ల‌నంగా మారింది. మ‌ద‌ర్ బోర్డ్ అనే ప‌త్రిక‌కు అమెజాన్ వెబ్ సిరీస్ ప్రతినిధి ఈ విష‌యాన్ని వెల్లడించారు. ఎన్ఎస్వో కార్యక‌లాపాలు తెలియ‌గానే.. ఆ సంస్థకు మౌలిక వ‌స‌తులు, ఖాతాల సేవ‌ల‌ను నిలిపివేసిన‌ట్టు అమెజాన్ వెబ్ సిరీస్ ప్రతినిధి తెలిపారు. అమెజాన్ వెబ్ స‌ర్వీస్ లోని క్లౌడ్ ఫ్రంట్ సేవ‌ల‌ను ఎన్ఎస్వో గ్రూప్ ఇటీవ‌లే ఉప‌యోగించ‌డం మొద‌లుపెట్టింది.

About Author