NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్టోబర్ 24 ప్రపంచ పోలియో దినోత్సవం

1 min read

పోలియో నిర్మూలనపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహణ

ప్రతి చిన్నారికి పోలియో వ్యాక్సిన్ (టీక) ముఖ్యమైనది

ప్రతి బుధవారం,శనివారం ఆరోగ్య ఉప కేంద్రాలలో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారు

జిల్లా  ఇమాన్యుయేషన్  అధికారి డాక్టర్:శోభ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:  ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా పోలియో వ్యాధి నిర్మూలనపై భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీలో ,వైద్య అధికారులు ,ఆరోగ్య కార్యకర్తలు మరియు సమాజ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా: యు.శోభా, పోలియో వ్యాక్సిన్ ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వివరించారు.ప్రపంచ పోలియో దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న జరుపుకుంటామని, దీని ప్రధాన ఉద్దేశ్యం పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రజలలో అవగాహన కలిగించడం, మరియు ప్రతీ చిన్నారిని పోలియో వ్యాధి నుండి కాపాడటంలో టీకాల ప్రాముఖ్యతను ప్రచారం చేయడమన్నారు. పోలియో ఒక తీవ్రమైన మరియు సంక్రమించగల వైరల్ వ్యాధి అని , ఇది ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తుందన్నారు. వ్యాధి కారణంగా శరీర భాగాల పక్షవాతం వచ్చే ప్రమాదముందని,. అయితే, టీకాల ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నివారించదగినదన్నారు. . మన భారతదేశం 2014 సంవత్సరంలో పోలియో రహిత దేశంగా ప్రకటించబడిందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ రోజు అనే సూక్తి  నేపధ్యంగా పాటించబడుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రజల్లో పోలియో వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను, పోలియోపై అవగాహన కల్పించేందుకు సంబంధిత అంశాలపై చర్చించారు. పోలియో టీకాలు  ప్రతి గ్రామ, పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు మరియు ఆరోగ్య ఉపకేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాలలో ప్రతీ బుధవారం మరియు శనివారం ఉచితంగా అందించడం జరుగుతుందని డా.శోభ తెలిపారు.

About Author