కార్తీక మహోత్సవాలలో భాగంగా మద్ది లో సప్తాహ కార్యక్రమాలు
1 min read

కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి చందన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సప్తాహ కార్యక్రమం ప్రారంభంఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం,గురవాయిగూడెం గ్రామములొ వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానము నందు 22.10.2025 నుండి 20.11.2025 వరకు కార్తికమాస మహోత్సవములలో భాగంగా 24.10.2025 న సప్తాహ కార్యక్రమములు ఉదయం గం.7.30లకు ప్రారంభమయ్యాయి. సప్తాహ కార్యక్రమములలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహావచనం,అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారిణి వారు భజనాపాళీలకు వరుణులు అందజేసి సప్తాహ కార్యక్రమం ప్రారంభించినారు. ఈ సప్తాహ కార్యక్రమం వారం రోజుల పాటు నిర్విరామముగా 24 ల పాటూ భక్తి సంకీర్తనలు జరుగును. అనంతరం కార్తీకమాసం సందర్భముగా ఆలయం నందు గోపూజా కార్యక్రమం జరిగినదని ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి, ఆర్.వి.చందన తెలియజేసినారు.
శ్రీ స్వామి వారి “గ్రామోత్సవం వాయిదా”
శ్రీ స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాస మహోత్సవముల భాగంగా ఈ నెల ది.26.10.2025 ఆదివారం జరుగు శ్రీ స్వామి వారి గ్రామోత్సవం వాతావరణం మార్పుదల(తుఫాను) కారణముగా ది.02.11.2025 ఆదివారం కు మార్పుదలచేయడమైనదని కావున భక్తులు,గ్రామస్తులు సహకరించవలసినదిగా ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి, ఆర్.వి.చందన తెలియజేసినారు.


