NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలను సహించం

1 min read

పెదవేగి మండల ప్రజా ప్రతినిధులు,టిడిపి నాయకులు,

 అప్పుడప్పుడు వాలిపోయే లండన్ వలస పక్షి కొట్టారు

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఇటీవల కొప్పాక గ్రామంలో దెందులూరు వైసిపి ఇన్చార్జి కొటారు అబ్బాయి చౌదరి కూటమి ప్రభుత్వంపై అలాగే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు మాట్లాడుతూ అబ్బయ్య చౌదరి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఉపేక్షించమని హెచ్చరించారు.  కొప్పాక సొసైటీలో లోన్ల విషయంలో అధికారులను బెదిరించి అబ్బాయి చౌదరి చేసిన లోన్లు అవకతవకల సైతం ఆడిట్ లో బయటపడ్డాయని వాటిపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. గతంలో కొప్పాక గ్రామంలో పింఛన్ల రూపంలో 13 లక్షలు చెల్లిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల రూపాయలను సామాజిక పింఛన్ల రూపంలో అందిస్తున్నామని, 20 లక్షల రూపాయలతో కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డబ్ల్యూ బిఎం రోడ్లు నిర్మాణం చేయడం జరిగిందని, త్వరలోనే పేదలకు నివాసయోగ్యమైన ప్రాంతంలో మూడు సెంట్లు ఇంటి స్థలం కూడా కూటమి ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్,  కొప్పాక గ్రామ సర్పంచ్ పరాసరం భాస్కర దీక్షిత్, పెదకడిమి గ్రామ సర్పంచ్ కొసరాజు బలరామకృష్ణ చౌదరి, కొప్పాక సొసైటీ ఛైర్పర్సన్ కొసరాజు వీర వెంకట వర ప్రసాద్, పెదకడిమి పార్టీ ప్రెసిడెంట్ మాదాల రాము, పెదవేగి మండలం ఎంపీటీసీ చల్లగొల్ల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author